శ్రీ శుభకృత్ సందేశం;-" రసస్రవంతి " & "కావ్యసుధ "9247313488 హైదరాబాద్
 కొత్తదనాన్ని ఎవరైనా                           
ఇష్టపడతారు
ఎందుకంటే......!?
పాతదనములో ఉండే
బాధలు, ఆవేదనలు
క్రొత్తలో ఉండవనే ఉత్సాహం
ఉండకూడదనే ఆశ.
భావాలైతే బాగున్నాయి
తదనుగుణంగా మనం                          
మారుతున్నామా !?
అలా మనలో భావాలు
మారినప్పుడు
కొత్తదనం
ఆనందాన్ని పంచుతుంది
అలా మనలో భావాలు                        
 సరియైన రీతిలో లేనప్పుడు
కొత్తదనం కూడా
పాత రొంపిలో కలుస్తుంది.
పాత భావాలే
కొత్తదనంలో ఉంటే
ఎన్ని నూతన
సంవత్సరాలు వచ్చినా
మనలో వెలితి
అసంతృప్తి తొలగదు
కొత్తదనాన్ని మనము                           
ఆస్వాదించాలంటే....
మనలో పాతవియైన
రోత భావనలు దూరం కావాలి
మనలో నూతన భావాలు                        
 ఉదయించాలి
జీవితాన్ని సాగించే జీవుడికి
బాధలు వేదనలు
రుగ్మతలు ఉండవచ్చు
అవి ప్రపంచములో ఉండనీ
వాటిని మననం చేస్తూ                          
 బాధపడుతూ కూర్చోకూడదు 
అవన్నీ జీవితములో మజిలీలు
ఇవన్నీ అర్థం చేసుకునేందుకే
చేదు,పులుపు, వగరు, తీపి
కలిపిన ఉగాది పచ్చడి ప్రసాదం
నూతన శోభను
మనలోని నింపుకొని..
ఆనందాన్ని నింపేందుకు
శ్రీ శుభకృత్ ఉగాది                           
సంవత్సరానికి
స్వాగతం పలుకుదాం !

కామెంట్‌లు