సమస్యాపూరణలు;-మమత ఐలకరీంనగర్9247593432
 *కారమునందు పుట్టెమమకారము చూడగ మానసంబునన్*
ఉ.
దారులు లేకపోయినను ధర్మము తప్పని సద్గుణంబుతో
బేరము లేకసాగు తన ప్రేమను పంచుచునింటి దీపమై
తీరము దాటనెంచి మరి తిప్పలనోర్చెడి మాతృమూర్తి సం
*స్కారము నందు పుట్టె మమకారము చూడగమానసంబుగన్*
 సమస్యాపూరణం
*భళ్ళున తెల్లవారినను పట్టణమందున నంధకారమే*
ఉ.
కళ్ళను కప్పివేసె రవి కాంతులు జేరక యింటిముందరన్
తృళ్ళిన నైరుతిప్పుడిక తెప్పలు కమ్ముచు సూచనివ్వగన్
వొళ్ళకు జల్లులంటుచును భూమిన జేరుగ పొద్దు గప్పెనే
*భళ్ళున తెల్లవారినను పట్టణమందున నంధకారమే*

కామెంట్‌లు