దత్తపది:--మమత ఐలకరీంనగర్9247593432
 దూరము భారము తీరము   తోరము పదాలతో చంపకమాల
ఐచ్ఛికాంశ వర్ణన;
చ.
జయమును కోరి *దూరమ* ను చక్కగ నెంచుక సాధనమ్ముకై
రయమున లేచి *భారము* ను లౌక్యముతో పరుగెత్త సాగగన్
భయమును వీడి *తీరము* కు బాధ్యత తోడను రోజు చేరగా
జయము వరించి *తోరము* గ జాప్యము లేకను కొల్వు దక్కెనే
విద్యావాని (ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా)
క.
అర్థింతురె దీనముగా 
నర్థన కనుకూలమైన నవ విద్యలకై
నిర్థారణ జేసి దయతొ
వ్యర్థులనక నొసగుతల్లి ప్రార్థన గనుచున్

కామెంట్‌లు