శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలతో;-మమత ఐలహైదరాబాద్9247593432
కం.
శుభములు కూర్చగ వచ్చెను
శుభకృతి నామమునుగాది సుమనోహరమై
నభయము కలిమిని కూర్చును
నభివృద్ధికి మెరుగు దిద్దు నవలోచనతో

సీ
శుభకృతు వత్సరం శోభతో వచ్చింది
      గతములో వెతలనమృతముజేయ
కొత్త లోచనలను విత్తంబుగాతల్వ
       సౌఖ్యంబు లొనగూరు జయము తోడ
షడ్రుచుల సారంబు సహకారమందించ
        నడవడిన్ దిద్దును నవ్యముగను
కోయిలమ్మల పాట కొత్తజీవనవేట
       నూతనోత్సాహమనోహరంబు
ఆ.వె
పచ్చ తోరణాలు పంచాంగ

శ్రవణము
రాజపూజితాల రాశి ఫలము
కరువు బరువు విలువ కర్చులాదాయము
హెచ్చరించుగాది ముచ్చటగను

కామెంట్‌లు