తెలుగు భాష - పరిణామ దశలు -బెహరా ఉమామహేశ్వరరావుసెల్ నెంబరు: 9290061336.

     ఈ భూమిపై జన్మించిన మానవజాతి, అనేక కష్టనష్టాల బారిన పడింది.తొలి మానవజాతి చెట్ల
తొర్రలలో కొండ గుహలలో నివాసం ఏర్పరచుకొని జీవించ సాగింది. కౄర జంతువుల మధ్య అనాగరిక జీవనం  కొన్ని వేల సంవత్సరాలు సాగించ వలసి
వచ్చింది. క్రమేపీ మనుషులలో వివేచనా శక్తి పెరిగింది. తనకు రక్షణ వలయం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన కలిగింది.
ఈ ఆలోచనల ఫలితంగా గుంపులు గుంపులుగా మానవులు తిరగసాగారు.  సంఘ జీవనానికి ఇదే ప్రాతిపదిక అయింది.
    మనిషి మనుగడకు నీరు ప్రధానమని తెలుసు
 కున్నాడు. జలం లేనిదే మానవునికి ప్రతిక్షణం
గండమేనని తెలుసుకున్నాడు. నదీతీరాలు చేరుకుని, గుడిసెలు వేసుకున్నారు. ఆకులను కూర్చుకుని మానం కప్పుకున్నాడు.చెట్ల బెరడులతో నారనుబట్టలా కప్పుకొని సంఘజీవనం ప్రారం భించాడు.కౄర జంతువులు అయిన పులులు సింహాలు ఎలుగుబంట్లు వంటి జంతువుల బారినుండి రక్షించుకొనుటకు ప్రత్యేక వలయాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆవులు, గేదెలు, మేకలు వంటి సాధు జంతువులను తన సంజ్నలతో పిలుస్తూ మచ్చిక చేసుకున్నాడు. సాముహిక  జీవితానికి 
ఆధార మైన నీరు లభించే చోట గ్రామాలు  నిర్మించుకున్నారు. తన నోటి నుండి వెలువడే శబ్దాలకు క్రమ రూపం ఇవ్వడం జరిగింది.మట్టి బొమ్మలు, కొయ్య బొమ్మలు తయారుచేసి లిపికి పునాదులు వేశాడు. కొన్ని వేల సంవత్సరాల కిందటే మానవుడు బొమ్మల లిపి ప్రారంభించాడు. దీని కోసం కొయ్య చెక్కలు మట్టి దిమ్మలు తయారు చేసుకుంటూ ఉపయోగించే వాడు.
     అడవులలో జంతువుల మధ్య అనాగరిక జీవనం గడిపిన మానవుడు సంఘజీవిగా మారడానికి అనేక కష్ట నష్టాలు భరిస్తూ బాధలు ఇబ్బందులు పడుతూ
ముందుచూపుతో కొనసాగాడు.
    గ్రామాలు అభివృద్ధి కోసం మనిషి భవిష్య జీవన యానం కోసం ఆనాటి మానవ జాతి యావత్తు శ్రమ
దమాదులకు ఓర్చి కృషి చేయ వలసి వచ్చింది.
        గోధుమ, వరి, జొన్నలు, రాగులు, చెరకు ప్రత్తి
వంటి పంటలు పండించడం అలవరుచు కున్నాడు.
మానవుడు కనిపెట్టిన మొదటి యంత్రం చక్రం.
తన ఆత్మ రక్షణ కోసం కత్తి, బల్లెము బాణము ఆయుధాలు తయారు చేసుకున్నాడు. వీటికి పేర్లను
పలుకుతూ  భాషా వినియోగానికి నాంధీ పలికాడు. 
      వివిధ వస్తువులు నిత్యజీవిత అవసరాలకు
ఉనికినిచ్చాడు. భావ ప్రకటనకు భావ గ్రహణానికి భాషను రూపు దిద్దాడు. మౌఖిక రూపం నుండి భాష లిఖిత రూపం ఇచ్చి భావి తరాలకు జ్ఞానం అందించేందుకు తగిన కృషి సల్పాడు.
       సంజ్నల ద్వారా భావవ్యక్తీకరణ క్లిష్ట పరిస్థితుల దాటి  లిఖిత పూరిత నూతన భాషా ప్రగతికి, సోపానాలు వేసాడు.
      (తదుపరి)

కామెంట్‌లు