నారికేళ విశిష్టత;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

   కొబ్బరికాయలను గురించి బోలెడు విషయాలు తెలుసుకోదగినవి ఉన్నాయి.దీని శాస్త్రీయ నామం 'కోకొనెట్ నూసిఫెరా'(coconut nucifera).
      వైద్యపరంగా  దీని ఉపయోగాల మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.కొబ్బరి తోటలు లేక కొబ్బరి చెట్లు ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 దేశాల్లో కనిపిస్తాయి.కోస్తా ప్రాంతాలలో ఇవి ఎక్కువగా పెరుగుతాయి.మన ఆంధ్రప్రదేశ్ లో తూ.గోదావరి కోన సీమ ప్రాంతం,అమలాపురం కొబ్బరి తోటలకి ప్రసిద్ధి.
       కేరళలో కొబ్బరి పరిశోధనా కేంద్రం ఉంది.మరొక పరిశోధనా కేంద్రం ఈశాన్య రాష్ట్రం గౌహతిలో ఉంది.
కొబ్బరి నీళ్ళు, కొబ్బరినూనె,కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మంచివి.చర్మ సౌందర్యానికి,కొన్ని రకాల చర్మ వ్యాధులకు కొబ్బరినూనె ఎంతో మంచిదని పరిశోధనలు ఋజువు చేస్తున్నాయి.
     కేరళ మరికొన్ని ప్రాంతాలలో కొబ్బరినూనెను వంటల్లో వాడతారు.కొబ్బరినూనె వాడకం వలన శరీరం లావుకాదు.గుండెకు మంచిది.
       కొబ్బరి నూనెలో లారిక్ ఆసిడ్( lauric acid),కాప్రిక్ ఆసిడ్(capric acid) అనే మేలు చేసే ఆమ్లాలు ఉంటాయి.లారిక్ ఆసిడ్ మన శరీరంలో మోనోల్యురైన్స్ గా మారిపోతుంది.ఇది ఎంతో ఆరోగ్య ప్రధాయిని.నిజానికి తల్లి పాలలో కూడా ఈ మోనోల్యురైన్స్ ఉంటాయి.ఇవి రోగనిరోధక శక్తికి మంచివి.కొబ్బరినూనె ఎముకలు డొల్ల(osteoporosis) బారకుండా కాపాడుతుంది!  వృద్ధులు,బలహీనంగా ఉండేవారు,జ్వరం బారీన పడిన వారికి కొబ్బరి నీళ్ళు ఇస్తే తక్షణం శక్తి వస్తుంది.ఎండిన చర్మం,పొడిబారిన చర్మానికి కొబ్బరినూనె మర్ధనం ఎంతో మంచిది. కొబ్బరి నూనెను మందులలో,సబ్బుల తయారీ పరిశ్రమలో వాడుతున్నారు.
     కొబ్బరి మట్టలతో ఇంటి కప్పు వేసుకోవడం మనకు తెలిసిందే, కర్ణాటక,కేరళలో పెద్ద కొబ్బరిచిప్పల పెంకుతో ఎండిన కొబ్బరి కాయలతో ఆకర్షణీయమైన బొమ్మలు కూడా చేస్తారు.
       ఇన్ని సుగుణాలు ఉన్న కొబ్బరికాయను తరచూ వాడటం ఎంతో మంచిది.
            *********

కామెంట్‌లు