తెలంగాణాలో అప్పటిలో సాలార్జంగ్ అనేక కళాఖండాలు సేకరించి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సాలార్జంగ్ మ్యూజియం స్థాపనకు కారకు డయ్యాడు.అదే విధంగా మహారాష్ట్రలోని పూనెలో రాజాదినకర్ కేల్కర్ అనేక కళాఖండాలను సేకరించి కేల్కర్ మ్యూజియం స్థాపించాడు.ఈయన 1896 లో జన్మించాడు.1920 నుండి ఇతని కళాఖండాల సేకరణ ప్రారంభమయింది.ఈయన సుమారు పదిహేను వేల కళాఖండాల్ని సేకరించాడు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఈయనకు ఎంతో సహాయం చేసింది అప్పటిలో.1962లో ఈయన తన సేకరణ మొత్తం ప్రభుత్వ పురావస్తు శాఖకు ఇచ్చివేశారు! ఇప్పడు ఈ మ్యూజియంలో సుమారు ఇరవైవేల కళాఖండాలు ఉన్నాయి.
అధ్బుతమైన తైల వర్ణ చిత్రాలు,అనేక రకాల వాయిద్య పరికరాలు,చెక్క కళాఖండాలు,వింత దీపాలు,దంతపు వస్తువులు,మహారాష్ట్రకు చెందిన పైథాన్ చిత్రాలు,అనేక పురాతన వస్త్రాలు,13 వశతాబ్దానికి చెందిన శిల్పాలు,16 వ శతాబ్దానికి చెందిన వంట పాత్రలు ఉన్నాయి.వీటన్నింటినీ మూడు అంతస్థుల భవనంలో అమర్చారు.
ఇక్కడ అనేక కళలలకు సంబంధించిన పుస్తకాల తో గ్రంథాలయం కూడా ఉంది.ఇదిగాక ఈ మ్యూజియం కళలలకు సంబంధించిన అనేక పుస్తకాలను ప్రచురిస్తోంది.
చిత్రకళ, ఇతర కళల మీద అనేక సభలుకూడా నిర్వహిస్తోంది.ఇంత అధ్బుతమయిన మ్యూజియం స్థాపించిన కేల్కర్ 1990 లో కీర్తిశేషులయ్యారు.
*************
కేల్కర్ మ్యూజియం బ్రోచర్ ఆధారంగా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి