వక్ర రేఖల మీద నడుస్తూ
సరళ రేఖలు అంటావెందుకు?
వృత్తాన్ని చేత బట్టుకుని
ఇది అంకె అంటావెందుకు?
నీ తలలో అర్థంలేని అంకెల
గజిబిజి గందరగోళం!
ఎంతకీ భాగింప బడని నీ అలవాట్లు!
ఎంతకీ హెచ్చింప బడని మంచిపనులు
అప్పుడప్పుడూ కొన్ని మంచి పనుల
మధ్యలో అనుకోని సున్నా!
నీ గుండె దిటవుకాని ఈక్వల్ ఈక్వేషన్!
నీ ఆలోచనలు ఇన్ఫినిటీ!
**********
వక్ర గణితం!;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి