కవిత్వం జన్మ ధన్యం!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.9441058797.
ఏప్రిల్ 30 శ్రీ శ్రీ జన్మదినం
శుభాకాంక్షలు అందిస్తూ --
===================
1.శ్రీ శ్రీ జన్మదినం, ఏప్రిల్ 30,
   శ్రామిక దినోత్సవ,మే డే,
                      స్వాగతదినం!
  ఆయన కవితకు పుట్టు,
    ఆయన తల కవితల పుట్ట!
  ఆధునిక కాలంలో,
      శ్రేష్టకవితల స్రష్టలలో దిట్ట!
 భావశ్రీ,భాషశ్రీ వెరసి శ్రీ శ్రీ,
     శ్రీరంగం శ్రీనివాసరావు!

2.ఆయన భావం శ్రీరంగం,
    హృదయం కవిత శ్రీనివాసం!
   సాంప్రదాయ ఛందోబద్ధ,
                  కవితా ధిక్కారం!
   నూతనవరవడికి,
                  చుట్టిన శ్రీకారం!
   అభ్యుదయ రచయితల,
                 అధ్యక్షస్థానం!
  విప్లవ రచయితల సంఘం,
          విరసం స్థాపనం!
 నమ్మకంలో నాస్తికత్వపునాది,
      అన్వేషణ లో హేతువాది!
    
3.జీవశాస్త్రంలో,
                       పట్టభద్రుడు!
   జనచైతన్యకళలో,
                       సిద్ధహస్తుడు!
  రకరకాల ఉద్యోగాలు చేసినా,
      రచయిత గా స్థిరపడ్డాడు!
"నా మార్గం అనితరసాధ్యం"
అన్నా,
        "గురజాడ అడుగు జాడ",
                        పట్టినవాడు!
ప్రాస,శ్లేష జోడు గుర్రాల్ని
   కవితా రథానికి కట్టి జోరుగా,
       పరుగులు తీయించాడు!

4.అల్పాక్షరాలతో,
   అనల్పార్థం అతనికే సాధ్యం!
 అతని వాక్యం,
   వ్యక్తికి బహువచనం శక్తి
  వాక్యం రసాత్మకం కావ్యం,
     అనడానికి ఓ గొప్ప సాక్ష్యం!
 ఆయన మహాప్రస్థానం
  కవితా లోకాన తలమానికం!
తెలుగు పాఠకుల,
  హృదయ సింహాసనాలపై,
              సదా విరాజమానం!
  తెలుగు కవితకు,
    దశ,దిశ నిర్దేశించిన గ్రంథం!
  శ్రీ శ్రీ ని మహాకవి శ్రీశ్రీ 
  చేసిన నిరుపమాన ప్రమాణం!

5.కవిత్వాన మార్క్సిస్టు,
     సినీకవిత్వాన గొప్ప టేస్ట్!
 ఒకే రోజున పండ్రెండు పాటలు,
 వ్రాసిసినీ చరిత్రలో అతడే బెస్ట్!
పాడవోయి భారతీయుడా
  నాడు, నేడు, ఏనాడూ నిలిచే,
                         ప్రబోధగీతం!
కలకానిది విలువైనది
            అద్భుత జీవన సారం!
చీకటి లో కారు చీకటిలో
    అనంతావేదన అక్షరరూపం!
ఆకాశవీధిలో అందాల జాబిలి
రసావిష్కరణం!
  తెలుగు వీర లేవరా!
అన్నాడు, జాతీయ అవార్డు,
 కైవసం చేసుకున్న మొదటి,
 తెలుగు సినీ కవిగా నిలిచాడు!

6.కవిత్రయం,
 తిక్కన, వేమన, గురజాడ
  అని ప్రవచించిన శ్రీ శ్రీ,
   వేటూరి మాటల్లో,
"శ్రీ శ్రీ పుట్టడంతో మనిషి!
 వృద్ధాప్యం లో. మహర్షి!
మధ్యలో మాత్రమే కవి! ఎప్పటికీ ప్రవక్తే!"
____'_____


కామెంట్‌లు