ఉగాది ఒక నవ్య స్వప్నం; - వెంకట రమణా రావు , 9866186864
ఉగాది
యుగాది
అనాది
ఊహాల
పునాది
ఆశల
పందిరి
జీవన 
లహరి.

మొదటి రోజు
రంగుల
చిత్రం
గడచి పోయాక
ఊహల లో
మిగిలే స్వప్నం

అందుకే
ఉగాది పచ్చడి లో
రుచి
తీపి చేదు వగరు
పులుపు కారం ఉప్పదనం ల
సమ్మిళితం

జీవిత పయనం లో ని
అనుభవాల సంకేతాలు

ఉగాది
అనంతం
నిత్య నూతన వసంతం
మధుర స్వప్నంకామెంట్‌లు