శ్రీ శ్రీ సాహిత్యం; -భరద్వాజరావినూతల -9866203795

 సాహితీబృందావనవేదిక 
వరుస సంఖ్య-8️⃣2️⃣
ప్రక్రియ-సున్నితం
రూపకర్త -నెల్లుట్ల సునీత 
********
4️⃣0️⃣6️⃣
భావసంద్రపు ఆకాశాన దృవతార
అభ్యుదయకవిత్వం  రాస్తాడు ప్రియమార
శ్రీరంగం శ్రీనివాసరావు ఆయన
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********
4️⃣0️⃣7️⃣
కవితావస్తువు కానిది లేదన్నాడు
ఏదైనా కవిత్వాని అర్హమన్నాడు
సాహితీలోకపు కవితా సూర్యుడయ్యాడు
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********
4️⃣0️⃣8️⃣
అభ్యుదయ కవిత్వం ఆయనూపిరి
కార్మకులకు ఆరాధ్యపు సిరి
శ్రామిక పక్షపాతి అతడు
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********
4️⃣0️⃣9️⃣
మహాప్రస్థానం తో మాటలాడి
ఖడ్గసృష్టితో కదం తొక్కి
నేను సైతమంటూ నిలిచాడు
 చూడచక్కని తెలుగు సున్నితంబు .---!
********
4️⃣1️⃣0️⃣
అభ్యుదయ వాదైన నాస్తికుడు అతడు
జిలుగువెలుగుల చీర శిల్పంచెక్కాడు
విప్లవాగ్ని రగిలించిన యుగకర్త
 చూడచక్కని తెలుగు సున్నితంబు .
********

కామెంట్‌లు