మన పర్వ దినములకు... "శ్రీకారం.. ఉగాది!" "శంకర ప్రియ"., శీల., సంచారవాణి:99127 67098
  మనదేశ సంస్కృతికి పునాది.. "ఉగాది!"
      మనతెలుగు సంవత్సరాది.. "ఉగాది!"
     చాంద్రమానం ప్రకారం
     పర్వదినములకు "శ్రీకారం.. ఉగాది!"
     నవశకమునకు "తొలిరోజు.. యుగాది!"
    🙏 చైత్ర శుద్ధ పాడ్యమి.. ఉగాది!
      అక్షర జ్ఞానమునకు అభ్యాసం  "శ్రీ పంచమి"
       ఆదర్శ దివ్యపురుషుని జన్మదినం "శ్రీ రామ నవమి"
  🚩 అద్వితీయ జ్ఞానదాతకు 
అంజలి  "శంకర జయంతి"
     సాధకు లందరికి జ్ఞానోదయం "బుద్ధ పూర్ణిమ"
     భక్త మహాశయులకు 
హితోపదేశం "గురు పౌర్ణమి"
     మనకు దేశరక్షణకు ప్రతీక "రక్షా బంధము"
      🙏శుభములను కలిగించు "వినాయక చవితి"
       శిష్టరక్షణ, దుష్టశిక్షణ నొసగు "విజయ దశమి"
       అసురశక్తుల పైన అఖండవిజయం "దీపావళి"
        ఆత్మీయులందరి సమ్మేళనం "కార్తిక వనభోజనం"
     🚩లీలామానుష విగ్రహుని జయoతి "కృష్ణాష్టమి"
       కురువంశ పితామహుని తపః ఫలం "భీష్మ ఏకాదశి"
      స్వాత్మ తత్త్వజ్ఞాన మొసగు  "శివరాత్రి"
        చాంద్రమానం ప్రకారం...
        మన పర్వదినములు  "శ్రీకారం... ఉగాది!"   
     వేదమాతాకి జై!

కామెంట్‌లు