జ్ఞాన రూపిణి విద్య"శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
 👌జ్ఞాన రూపిణి విద్య!
     ఆత్మ బంధువు విద్య!
      ధర్మ దేవత విద్య!
              ఓ తెలుగు బాల!
             ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ.)
👌"విద్య" అనగా జ్ఞానము! అది.. ఆధ్యాత్మిక విద్య, మరియు, భౌతిక విద్య.. అని, రెండు విధములు! అవి, రెండూ జ్ఞానమును సముపార్జించు సాధకులకు అత్యావశ్యక మైనవి!
👌గృహస్థ ధర్మమును శ్రద్ధాసక్తులతో ఆచరించు ధార్మిక తత్పరులకు; విశేష వైభవమును సమకూర్చు చున్నదీ "విద్య"!
👌పలు ప్రాంతములు, మరియు, విదేశములు సంచరించు ఉద్యోగులకు, ప్రయాణికులకు; రైలుబండి వలె ప్రయాణ సాధనముగా, బహుళార్ధ సాధకముగా ఉపకరించు చున్నదీ "విద్య"!
⚜️ సీస పద్యము (పాదం) ⚜️
     గృహమేధి సద్ధర్మ మహితులౌ వారికి,*)
విద్యయే విభవాభివృద్ధి గూర్చు!
       పరదేశ సంచార పరులైన వారికి,
విద్య రైల్బండియై వెలయు చుండు!
      ( "ఆశుకవి చక్రవర్తులు",  "అవధాన పంచాననులు"  శ్రీ కొప్పరపు సోదర కవులు., )
           ఓం ఐo సరస్వత్యై నమః!

కామెంట్‌లు