విద్యల కధిదేవత - వాణి "శంకర ప్రియ.," శీల.,సంచారవాణి: 99127 67098
 👌విద్యల కధిదేవత
     వాణి, వీణాపాణి
      పలుకుల జనని, వాణి
              ఓ తెలుగు బాల!
             ( తెలుగు బాల పదాలు., శంకర ప్రియ.)
👌వాగ్రూరూపిణి యే "వాణి"! వీణాపాణి యే వాణి! జ్ఞాన విజ్ఞాన దాయిని యైన వాణీ స్వరూపమే "విద్య"!
👌"విద్య"అనగా జ్ఞానము, విజ్ఞానము! అదియే.. కీర్తిప్రతిష్ట
లకు దృఢమైన సౌధము! మోక్ష ప్రాప్తికి బంగారు బాట!
 👌అది.. పాపము లనెడు పర్వతశ్రేణులు పడగొట్టుటకు వజ్రాయుధము వంటిది! సమస్త విద్యలకు అధిదేవత యైన, సరస్వతీ దేవికి వందనము! అభివందనము!!
⚜️ సీస పద్యము (తేట గీతి) 
   యశమునకు విద్యయే మేటి యవసధంబు!
    పరమునకు విద్యయే మంచి పట్టుగొమ్మ!
    పాపగిరులకు విద్యయే వజ్రధార!
     అట్టి విద్యాధిదేవత నభినుతిoతు
    
      ( "ఆశుకవి చక్రవర్తులు",  "అవధాన పంచాననులు"  శ్రీ కొప్పరపు సోదర కవులు., )


కామెంట్‌లు