తనువులో గౌరమ్మ;"శంకర ప్రియ.," శీల.,-సంచారవాణి: 99127 67098
 👌తనువులో గౌరమ్మ
     తలపైన గంగమ్మ
      నిలుపుకొన్న శివయ్య
              శంకర ప్రియులార!
 (--- శంకర ప్రియ పదాలు.,)
👌పార్వతీదేవి.. శక్తి స్వరూపిణి! మంగళ గౌరి! ఆమె.. పరమేశ్వరుని పతిగా పొందాలని తీవ్రమగు తపస్సు చేసింది! భక్తి ప్రపత్తులతో.. పరమ శివుని త్రికరణముల శుద్ధిగా సేవించింది! అఖిలాండ కోటి బ్రహ్మాoడ నాయకు డైన పరమేశ్వరునిలో అర్ధభాగము పొందింది! అందువలన, "పరమేశ్వరి" యైనది!
👌గంగాభవాని.. శక్తి స్వరూపిణి! జలమునకు అధి దేవత! ఆమె.. భగీరధుని తపః ఫలితముగా; దివి నుండి భువికి వచ్చే క్రమములో; పరమశివుని జటాజూటము నందు బంధింప బడినది! పిమ్మట, భగీరథుని మనోరథము నెరవేర్చింది. కనుక "భాగీరధి" యైనది! పరమశివుడు..  "గంగాధరుని"గా విఖ్యాతి నొందాడు. గంగమ్మ.. నోము ఫలితముగా, మహాదేవుడయిన శివునకు "శిరో భూషణము" యైనది.
⚜️ సీస పద్యము ( చరణములు )
   జపమేమి చేసెనో, జనయిత్రి శైలజ; సామేను దాల్చిన సౌఖ్య మబ్బె!
    నోమేమి నోచెనో భామామణీ గంగ; పతి శిరంబున నుండు భాగ్య మబ్బె!
    
      ( ఓం నమః శివాయ., "శివలెంక" డా. మీగడ రామలింగ స్వామి)

కామెంట్‌లు