నవయుగ వైతాళికుడు; -కవిమిత్ర, సాహిత్యరత్నఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్చరవాణి:-9963265762
విప్లవశంఖారావమే ఆయన కలానికి బలం.
సాహితీవనంలో మణిపూస
కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేది కవితకనర్హం అని 
ఛందోబద్ద కవిత్వం కాదు
సామాజిక స్పృహ కలిగిన కవిత్వమే సమాజాభివృద్ధికి సోపానం అన్న సాహితీ మూర్తి,అక్షర శ్రామికడు శ్రీ శ్రీ  అందుకో 
మా శతకోటి వందనములు......!!

పూడిపెద్ది వారింట పుట్టి
శ్రీరంగం వారి దత్తతతో శ్రీ శ్రీ గా మారిన శ్రీరంగం శ్రీనివాసరావు సాహిత్యపు దశా-దిశా మార్చిన సమాజకవి.
అభ్యుదయరచయితల సంఘ అధ్యక్షునిగా, సినీగేయరచయితగా,
విప్లవరచయితల సంఘ స్థాపకునిగా సాహిత్యానికే ప్రపంచాన గుర్తింపు తెచ్చిన మహాకవి శ్రీ శ్రీ అందుకోండి
మా శతకోటి వందనములు........!!

పతితులార,భ్రష్టులారా
భాధాసర్పద్రష్టులారా
దగాపడిన తమ్ములార
ఏడవకండేడవకండి అని నిర్భయంగా  చాటినా,
మరోప్రపంచం, మరోప్రపంచం, మరోప్రపంచం పిలిచింది
పదండి ముందుకు పదండి ముందుకు పోదాం పోదాం పై పైకి అన్నా,
ఎముకలు క్రుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా చావండి అన్న విప్లవకవి శ్రీ శ్రీ అందుకో మా శతకోటి వందనములు......!!

మనసున మనసై, బ్రతుకున బ్రతుకై అన్న,
హలో హలో ఓ అమ్మాయి పాతరోజులు మారాయి అని వ్రాసినా,
తెలుగువీర లేవరా దీక్షపూని సాగరా అని ఎన్నో ఎన్నెన్నో సినీగీతాల రారాజువై ప్రఖ్యాతినొంది
ఈ శతాబ్దపు మహకవిని నేనే అని సమాజానికి  ధైర్యంగా చాటిన శ్రీ శ్రీ మీరు 
" నవయుగ వైతాళికులే"
అందుకోండి మీ కివే 
మా శతకోటి ప్రణామాలు ........!!


.................................

కామెంట్‌లు