ఆటవెలది పద్యాలు ,;-భానుప్రియ 9వ తరగతి,ఈ/యం,జి.ప.ఉ.పా.కుకునూర్ పల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా.
 1.
అమ్మమాట తోడ ఆత్మీయతను పంచి
అన్ని పనులు నేర్పు అద్భుతమ్ము
అమ్మ నాన్న లనగ ఆది దేవతలురా
భాను ప్రియ మాట  పసిడి మూట .
2.
గురువు నేర్పు చదువు గుర్తు పెట్టుకొనియు
చదువ వలెను రోజు చక్కగాను
విడువ రాదు పట్టు విజయమ్ము  దక్కురా
భానుప్రియ మాట పసిడి మూట .


కామెంట్‌లు