జాతర (బాలగేయం);-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
జాతరమ్మ జాతర 
ఏడుపాయల జాతర 
వనదుర్గా జాతర 
అమ్మవారి జాతర !!జాతర!!
జాతరలో జనాలు 
బాగున్నరు బాగున్నరు
జాతర్లో ప్రసాదాలు 
బాగున్నయ్ బాగున్నయ్ !! జాతర!! జాతరలో బొమ్మలు 
బాగున్నయ్ బాగున్నయ్ 
జాతరలో మిఠాయీలున 
బాగున్నయ్ బాగున్నయ్ !!జాతర!!
గుడిలోన అమ్మవారి 
పూజలే పూజలు 
గుడికొచ్చిన భక్తుల 
బోనాలే బోనాలు !!జాతర!!
అగ్గి గుండాలలోన భక్తులు
నడుచుడే నడుచుడు
గుడి చుట్టూ ఎడ్ల బండ్లు 
తిరుగుడే తిరుగుడు !!జాతర!!
రథములోన అమ్మవారు
తిరుగుడే తిరుగుడు
రథము ముందు భక్తులు
భజనలే భజనలు !!జాతర!!


కామెంట్‌లు