భారతదేశ వజ్రోత్సవ వేడుకలు

 ప్రపంచస్థాయి జూమ్ వేదికపై 22/4/2022 వ తేదీన రాత్రి ఏడు గంటల ముప్ఫయి నిముషముల నుండి పదకొండు గంటల ముప్ఫయి నిముషముల వరకు  "భారతదేశ వజ్రోత్సవ వేడుకల సందర్భం" లో భాగంగా మూడు రోజుల పాటు రసవత్తరంగా జరిగిన తానా వారి కవితా లహరి కార్యక్రమంలోని మొదటి రోజు కార్యక్రమం తానా ప్రస్తుత అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు గారు, తానా పూర్వ అధ్యక్షులు శ్రీ తాళ్లూరు గారు, ముఖ్య అతిథి డా.గురవారెడ్డి గారు, విశిష్ట అతిథి డా. రామనాథం నాయుడు గారు,  అరుణ తేళ్ల గారి ప్రసంగాల నడుమ సమన్వయ కర్త శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ గారి అద్భుత వ్యాఖ్యానంతో అలరించింది.ఈ కార్యక్రమంలో అందిన మహదవకాశాన్ని వినియోగించుకుని "పక్షుల రక్షణ ప్రకృతి రక్షణే" అనే తన సందేశాత్మక కవితను వినిపించడంతో పాటు ప్రశంసలను అందుకున్నారు కవయిత్రి  కె.వీణారెడ్డి గారు.
"తానా కవితా లహరి" కార్యక్రమం విజయవంతం అయింది.
మీరు రాసిన కవిత చాలా బావుంది. 
అందమైన పదాలతో.. అర్థవంతంగా, 
గంభీరమైన భావాలను ఆవిష్కరించారు.
మీరు చదివిన తీరు, సమయపాలన బావున్నాయి. 
ఈ కార్యక్రమానికి మీ కవిత వన్నె తెచ్చింది.
మీకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. మా ఈ కార్యక్రమం లో పాల్గొన్నందుకు హృదయ పూర్వక  ధన్యవాదములు. 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చిగురుమళ్ళ శ్రీనివాస్,
అంతర్జాతీయ సమన్వయ కర్త,
తానా ప్రపంచ సాహిత్య వేదిక, TANA.
చిగురుమళ్ళ శ్రీనివాస్ గారి ప్రశంసాత్మక వ్యాఖ్యానమునకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
కామెంట్‌లు