*ఆడి, తప్పనివాడే... *గీత రచన, కోరాడ నరసింహా రావు !

 సాకీ :-
మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణము సుభట కోటి ధరిత్రిన్, బోటికిప్రాణము మాన ము... చీటికీ ప్రాణమ్ము వ్రాలు 
సిద్దము సుమతీ.... !
పల్లవి :-
      ఆడి, తప్పనివాడే హరి శ్చంద్రుడూ..., మాట ఇచ్చి మరిచాడు దుశ్యంతుడు ! 2
ఒకసత్యవాక్పరిపాలన,వెయ్యి 
యాగముల సమము !మాటయిచ్చి తప్పబోకురా ఓ మనిషీ ! అపుడె మెచ్చురా నిన్ను ఈ జగతి !
    "మాటాడి తప్ప..... "
        "ఆడి, తప్పని వాడే... "
చరణం :-
      ఆడి, తప్పుటకన్నా... అసువులనర్పించుటయే మిన్న 
యనీ,తలచిన సిబి, బలి, కర్ణు లు మాటను నిలబెట్టుకుని... 
మహోన్నతులుగా చరిత్రలో నిలిచినది నిజం కదా... ! 2
      "ఆడి, తప్పనివాడే... "
చరణం :-
      అసత్యమ్ము నెపుడూ చెప్ప
బోకుము ! ఆడిన మాట నేనా డూ  తప్పబోకుము !!
మాటతప్పిమనుటకన్న,మరణ
మే మేలూ... !
   మాటకొరకు మరణించినా... 
చిరంజీవి వవుతావు... నీవు చిరంజీవి వవుతావు, చరిత్రలో నిలుస్తావు... చరిత్రలో  నిలు స్తావు !!
      
కోరస్ :-
సత్యమే... దైవము..... 
   సత్యమేవ జయతే.... !
       సత్యమేవ జయతే... !!
   *******
కామెంట్‌లు