దాగుడు మూతలు;-హరిప్రియ
ఏమిటో ఈకాలం  నిన్నునన్ను
ఆడిoచుతుంది దాగుడుమూతలు 
ఋతువుల తేరుపై
ఆశల పుప్పొడులు అద్ది
నాఊసుల లేఖలు పంపుతున్నా....

చిలుక పలుకుల స్వరజతులు
 మదిలో ఆనందస్వరరాగాలు
నెమలమ్మ నృత్య భంగిమలు
మబ్బులు రాల్చు అమృత జల్లులు
చెలీ చెట్టాపట్టాలేసుకు విహరిద్దాం

మమతల ఒడ్డుకు చేరుకుందాం
ఆశల తీరపు గగనాన విహరిద్దాం
నమ్మిన సిద్ధాంతాలతో
రేపటి భవిత కై కలలు కందాం

బతుకు బంగారు బండి గా మలుద్దాం
నలుగురు మెచ్చే రీతిన నడిచి
నలుగురికి బాసటగా నిలిచి
వెనుకంజ వేయని మలుపులలో
క్రమశిక్షణ మంత్రాక్షరాలను 
వల్లిస్తూ సాగుదాం

కలలను సాకారం చేసుకుoదాo
ఋతువుల గమనాలలో....
అనుభవాలను పోదువు కుంటూ...
నిన్న నేడు రేపు కు వారధి లా
మన అడుగులతో పది అడుగులను జమ చేసుకుంటూ ఆదర్శంగా నిలుద్దాం !


కామెంట్‌లు