బాల గేయం - ఎం. వి. ఉమాదేవి
దత్త పదులు 

కాంచె శోభలు కనులు 
రంగుల పువ్వుల వనులు 
త్రవ్విన గనులలో మణులు 
 అల్లరి బాలలు ఘనులు !!

ఎంతో తెలివగు నరులు 
వారికి మనసులు విరులు 
సరియగు మిత్రులు తరులు 
శుభముకి జయముకు వరులు !!

కొండలు పుడమికి సిరులు 
జలధియే పగడపు సరులు 
మబ్బులు గిరులకు కురులు 
కురిసే జలముల ఝరులు !

కామెంట్‌లు