రావమ్మా వసంత లక్ష్మి..!!;-కొప్పుల ప్రసాదు-నంద్యాల
తొలిసంధ్య వేళలో ఉషస్సు రెక్కలు విప్పి
వసంత ఋతువు ఆగమనం పలికే
కొమ్మ మీద కోయిలమ్మ కుహుకుహు అంటూ
భూపాలరాగం ఆలపిస్తూ స్వాగతం చెప్పే...

లేలేత మామిడి పిందెలు చెట్టుకు
రాగల బంగారు గుత్తులుగా విరాజిల్లే
నింగిలోని వెన్నెల కాంతివలె 
వేపపూత పిల్లలు మనసు కాంతులు వెదజల్లే...

చెట్లన్నీ చిగురాకులు చిద్విలాసంతో తొడగగా
షడ్రుచుల సమ్మేళన యుగానికి ప్రకృతి ప్రసాదం
భూమి పుట్టుకైన ఉగాది పర్వదినానికి 
వసంతం చల్లుతున్న శుభ వేళ ఈ చక్కటి శుభవేళ.


షడ్గుణాలను తొలగించే ఔషదం షడ్రుచులు సేవించి
సుఖసంతోషాలతో, ఆయుఃఆరోగ్యాలతో ఉండాలని 
నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుదాం
ప్రకృతిని ప్రేమించి కాలుష్య రహిత నవ సమాజాన్ని నిర్మిద్దాం..

నీరాకతో ఆశలు కొత్త చిగుళ్ళు తొడిగే 
ఆచారాలు సంప్రదాయాలు,అవే అడుగులు
పండుగలు ,పంచాంగశ్రవణాలు వింటూ
వెలుగు పెంచేందుకు మాయింటికి రావమ్మా ఉగాది లక్ష్మీ.

ఆరోగ్య సూత్రాలు, ఆచారసంప్రదాయాలు,
పారమార్థిక విషయాలు, పండుగ అంతరార్థం
పండుగ పారమార్థం తెలుసుకుంటే జీవితం సార్థకం
నవ్వుతూ, నవ్విస్తూ ఆనందంగా గడిపేందుకు
రావమ్మా వసంతలక్ష్మి.

కామెంట్‌లు