శ్రీ శుభకృతు నామ తెలుగు సంవత్సరాది ' ఉగాది ' శుభాకాంక్షలు ;- * రామానుజం + కుటుంబ సభ్యులు *
కంద  పద్యం   :
తీపిగ  చెరుకు ను ; సాగర
ఉప్పు ;మిరపకాయ కారమును ;చేదునకై
వేపయు ; మామిడి వగరు ; పు
లుపు చింత -కలసిన ఆరు రుచులుం డవలెన్  !

కంద  పద్యం   :
ఆరు రుచులనూ  కలుపగ -
ఆరోగ్య ము తోడ  ; లోక శాంతిని  పొందన్   ;
కోరెద  నూతన,  శుభకృతు  , 
ఆరంభ దినము ' ఉ గా ది '-  అన్నిట శోభన్   !! 

కంద  పద్యం   :
తెలుగు ప్రజలలో  రైతులు  
తొలి నాగలి పట్టు చుంద్రు; మొదలిడు చిట్టాల్  
తొలి సారిగ  వ్యాపారులు  ;
తెలిసికొనును నేడు జాతక స్థితిని ప్రజలున్   !! 

   శ్రీరస్తు🍀🌺🍀 🕉☘️🌹☘️శుభమస్తు

కామెంట్‌లు