ప్రబోధగీతం :- ఓ నవయువతా ;--రచన, స్వరకల్పన, గానం... కోరాడ నరసింహా రావు !
 పల్లవి  :-
         ఓ.... నవయువతా... !
మంచిగా మార్చుకోండి   మీ నడత 


     మీ చేతుల్లోనె  ఉంది  దేశ భవిత ! నిలబెట్టాలి మీరే మన ఘనత !
       "  ఓ నవయువతా..... "
చరణం :-
.          వ్యామోహాలలో  మీరు 
పడి పోవద్దు !
   విచక్షణను ఏనాడూ కోల్పో వద్దు !!
  కామాంధులైమీరుకానిపనులు
 చెయ్యొద్దు ! కన్నవారికి  తల వంపులు తేవద్దు !!
        " ఓ నవయువతా..... "  
చరణం :-
       దుర్వ్యసనాలకు మీరుబలి కావొద్దు !
       నిర్వీర్యులై  చతికిలబడి పో వద్దు....       2
       కండబలం, గుండెదిటవు కోల్పో వద్దు..., 
        మీరే దేశానికి బలమూ  -   బలగమూ.... !!       2
       " ఓ  నవయువతా..... "
   ********
కామెంట్‌లు