ఉగాది చైతన్యము ;- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
కాలకన్యక దివ్య గమనము 
అనేక పర్వదినాల నిత్య కోలాహలం 
ప్రకృతి పులకరించే సమయం 
క్రొంగొత్త ఋతువు ప్రవేశసంరంభం 
లలిత రాగాలు పలికే జనహృదయం 
జ్వలితకిరణాలు కులికే భానుస్పర్శ 
రోగహరణమైన దైవాశీస్సులహేల 
హరితతరువుల ఫలపుష్ప ప్రదర్శన 
వన్యప్రాణుల నిర్భయవిహారవేదిక 
భారతీయత తెలుగుదనం కలయిక 
భావిపౌరుల కార్యదీక్షల సంకల్పం 
నిత్యమూ సత్యమూ నవయుగాది 
భవ్య చేతనల భాగ్యశ్రేయోభిలాషి 
రావమ్మా శుభకృతూ స్వాగతం !!

వాకిట్లో నిలిపే రంగవల్లి శోభలు 
వనితావని శ్రమలతో విరాజిల్లు 
గృహకృత్యాలవిగో  క్రమశిక్షణాయుతం 
ఆబాల గోపాల ఆనందతీరాలు
దానమూ గానమూ భక్ష్యమూ భోజ్యమూ 
మననం స్మరణమ్ కరణం జయతే !
వేవేల స్వప్నాల సాకార రూపాలు 
కవి సమయం కల్పనా చాతుర్యం 
భవహృదయం శారదా నివేదనం !!

కామెంట్‌లు