బాలలూ... ! మనకీరోజే ఉగాది పండుగ ! ఉగాది అంటే
ఈ యుగానికి పుట్టినరోజర్రా !
ఈ ప్రపంచానికి నాలుగు
యుగములు, సత్య, త్రేతా, ద్వాపర, కలి యుగములవి !
మూడు యుగములు గడచి పోవగా నాల్గవ యుగ మున మనమున్నాము !
ఈ కలియుగాన మానవ ధర్మం ఒంటి కాలితో కుంటుతు ఉంది !
ఎక్కడచూసినఅన్యాయము
అరాచకములే కనిపిస్తూ...
మంచివారికి బ్రతకటమే కష్టమయీ బాధపడుచుండె !
మనకున్నవి అరువది తెలుగు సంవత్సరములు...
ప్రతి వత్సరమూ అరువదేండ్ల కొకపరి మరలా వచ్చు చుండును...!
యీ కలియుగమారంభమైన
చైత్రశుద్ద పాడ్యమి రోజున...
ప్రతియేడూ యీ యుగము పుట్టిన రోజును, పండుగ గా జరుపుకుందుము !
నేడు మనము కాలపురుషు డైనశుభకృత్ పేరున ఉగాది పండుగ జరుపుతుంటిమి !
పాడైపోయిన పాతవన్నిటిని
తొలగించి, కొత్తఅలంకారముల
అందాలు ఆనందము కలిగిం చగా...ఆనందోత్సాహముల,భక్తి శ్రద్దలతో... అశుభములన్ని తొలగిపోయి, శుభములను చేకూర్చమని దేవతలను పూజించెదము !
క్రొత్తమామిడివేపపువ్వును
కొత్తబెల్లము,ఉప్పు, పులుపు
మొదలైన ఆరు రుచుల కల యికతో ఉగాది పచ్చడి...
నైవేద్యముగా అర్పించి, ప్రసాదముగా తీసుకుందుము!
జీవితమంటే రుచులన్నీ
కలగలసిన అనుభవమేనని
ఆనందముగా అనుభవించ వలెననియే యీ సందేశము!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి