ప్రేమ వసంతం(నవల)సమీక్ష;-- మాధవ్,సినీ డైరెక్టర్-- హైద్రాబాద్


 కథ క్లారిటీగా మనసులో ఉండి పెన్ను పట్టుకుంటే చాలు రెడీ అంటూ ఎక్కడా ఆగకుండా పేపర్ పై పరుగెడుతుంది.  ఆ పరుగులో ఆకాశంలోకి ఎగురుతామో, నదిలో ఈదుతామో, ఏం చేస్తామో రాసేవారికి, మనసులా స్వచ్చంగా ఉండే పేపర్ కే తెలుస్తుంది.  ఇవ్వాళ మీ నవల 'అనురాగ వసంతం' (కాసేపు ఆ పేరుతోనే నన్ను పిలువనివ్వండి) చదువుతుంటే మీరూ అలాగే స్వచ్చంగా రాసారనిపించింది.  ఎక్కడా అనవసర డీవియేషన్ లు లేకుండా చెప్పాలనుకున్న విషయం డైరెక్ట్ గా చెప్పేస్తూ, కథ నడిపిన విధానం నచ్చింది.  డ్రామాల్లో నటించినట్లు జీవితాల్లో కూడా నటించడం జనాలకు బాగా అలవాటైపోయింది.  అందరినీ అంచనా వేయగలననుకొంటారు కానీ ఎవరికి వారు వారి గురించే అంచనా వేసుకోలేని రోజులివి.  ఈ క్షణం ఉన్న మైండ్ సెట్ మరుక్షణానికి ఉండట్లేదు అలాంటి మెజారిటీ మెంటాలిటీ పీపుల్ కి ప్రేమ ఏ దశలో అయినా, ఏ వయసులో అయినా దినదినాభివృద్ది చెందేదే కానీ తరిగిపోనిది కాదని గట్టిగా భలే చెప్పారు.  మళ్లోసారి నాకు నచ్చిన, మీరు రాసిన డైలాగ్ (నాకు అలానే అనటం వచ్చు) 'ఆకాశం రాత్రి పైటను కప్పుకుంది, నక్షత్రాలు డిజైన్ లా అందులో చేరాయి' ని నెమరు వేసుకుంటూ సెలవు!
యలమర్తి అనూరాధ
హైద్రాబాద్
చరవాణి:924726౦206
కామెంట్‌లు