-*ఆనందంగా... జీవించేరు !*;- కోరాడ నరసింహా రావు !
 సుఖముగమనముబ్రతకాలంటే
  గొప్పగా ఎదగాలి !
    
గొప్పగ మనముఎదగాలంటే 
      చక్కగా చదువుకోవాలి !
  చదువులు బాగా రావాలంటే 
     శ్రద్దా బుద్దులు ఉండాలి !
   శ్రద్దాబుద్దులు కలగాలంటే... 
    క్రమశిక్షణతో మెలగాలి !
    మనలో...క్రమశిక్షణకుమనఇల్లే
       తొలిపాఠశాల కావాలి !
తల్లీ, తండ్రీ... తాతా, బామ్మలె
    గురువులయీబోధించాలి !
     క్రమశిక్షణతోసమయపాలన, వినయ,విధేయత...,,
...శ్రద్దా,బుద్దులు,కలిగిన పిల్లలె.
చక్కగా  చదివేరు, 
            గొప్పవారిగాఎదిగేరు...            
  వివేకవంతులయీ వారే...   
             ఆనందం గా బ్రతికేరు !           
     *******

కామెంట్‌లు