కోతి చేసిన ఉగాది.( ఉగాది పండుగకు ప్రత్యేకం.);- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 అడవిలోని జంతువులను సమావేశ పిలిచిన సింహరాజు ' రేపు ఉగాది ఇది మనకు తొలిపండుగ ఇది షడ్ రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసింది ఉగాది పచ్చడి. జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను,కష్టసుఖాలను ఒకేలా స్వీకరిం చాలన్నసందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. దీని కోసం చెరకు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, ఉప్పు, మిరపకాయలు, బెల్లం వాడుతారు మీరంతా ఉగాది పండుగ ఉత్సాహంగా జరుపుకొండి 'అన్నాడు.
మరుదినం ఉదయాన్నే సింహారాజు గుహకు చేరిన పిల్లరామచిలుక 'మహారాజా తమరు త్వరపడాలి అవతల కొంపలు అంటుకుంటున్నాయి 'అన్నది పిల్లరామచిలు. ' ఎవవరి కొంపలు అయినా అడవిలో కొంపలు ఎలావచ్చాయి? 'అన్నాడు నింపాదిగా సింహరాజు. 'మహాప్రభో అక్కడ కోతి ఏదో మందు బండపైన నూరుతున్నాడు మరలా ఈఅడవిలో ఎవరికి మూడిందో 'అన్నది పిల్లరామచిలుక . ' సరే పద 'అని చిలుకను అనుసరించాడు సింహారాజు.
తనముందు ఉన్న ఎండుగుమ్మడికాయను అడ్డంగా పగులకొట్టి కంచంలా తయారుచేసి దాని నిండుగా తను అప్పటివరకు నూరిన పచ్చిమిరప కాయల పచ్చడి నింపాడు. అప్పుడే అక్కడకు వెళ్ళిన పిల్లరామచిలుకనూ, సింహారాజు ను చూస్తూనే 'ప్రభువులు ఇలా దయచేసారు కాకితో కబురు పంపితే నేనే వచ్చేవాడిని 'అన్నాడు వినయంగా చేతులు కట్టుకుని. ' ఈ నక్క వినయాలకు ఏమీ కొదవలేదు మీవలన అడవి జంతువులకు ఎప్పుడూ ఏదో ఒక ఉపద్రవం వస్తుంది. ఈసారి ఏదో తమరు మందు తయారు చేస్తున్నారు అని విన్నాను ఏమిటది? 'అన్నాడు సింహారాజు. 'ఓహో ఇది తమరిపనా 'అని పిల్లరామచిలుకను చూసింది కోతి. 'కొండ సరిపోయిందట ఎక్క దిగా తిక్కలి  వాడు తిరునాళ్ళ ' అన్నది పిల్లరామచిలుక.  ' ప్రభూ తమరు చెప్పినట్లు ఉగాది పచ్చడి షడ్ రుచులతో తయారుచేస్తున్నాను  'అన్నాడు కోతి. 'మేము నిన్ను నమ్మను ఏది చూపించు 'అన్నాడు సింహారాజు. సగంపగిలినగుమ్మడికాయనిండుగా ఉన్న పచ్చిమిరప కాయల పచ్చడి అరచేతిలో ఉంచుకుని సింహారాజు చేరుగా వెళ్ళిన కోతి కాలుకి రాయి అడ్డం తగలడంతో నిలబడలేనికోతి చేతిలోని పచ్చిమిరప కాయల పచ్చడిని సింహారాజు ముఖానవేసీంది. అది చెదిరి చిన్న చిదప పిల్లరామచిలుక ముఖంనిండిపడింది. కళ్ళమంటతో సింహారాజు బాధతో ఘర్జించాడు. 'ముంచాడు కొతి కొంప 'అని అరుస్తు ఎటువెళ్ళాలో తెలియక కళ్ళుకనపడక పిల్లరామచిలుక లబలబలాడింది. 'ఇదే నాఉగాది పండుగ ' అని అడవిదాటి దూరంగా పరిగెత్తాడు కోతి.

కామెంట్‌లు