1. నాటి తాళపత్ర గ్రంథాలు!
నేడు ఉన్న అచ్చు పుస్తకాలు!
జ్ఞానభాండాగారం ,
తెరిచే తాళాలు!
జీవితాన నింపు జ్ఞానగంధం!
తెలుపు జీవన పరమార్థం!
2.ప్రపంచాన్ని తెలియాలి!
పుస్తకాలు చదవాలి!
పుస్తకం రచయిత ఆత్మ!
ఆవిష్కరించుకుంటే,
సార్థకం మానవజన్మ!
3.ఆదికావ్యం, ఆధునికకావ్యం!
జీవననిర్దేశం,ఆదర్శసందేశం!
చదవడం వికాసం కొరకు!
ఏది పడితే అది చదవకు,
అది నిన్ను కొరుకు!
చదవడంలో వివేకం ,
జోడించు!
3.పుస్తకం వీడని నేస్తం!
వెనక్కి పోని చాచిన హస్తం!
అది నీకందిస్తుంది సమస్తం!
పుస్తకం చదివే సమయం!
నీవు సమయం
సద్వినియోగం చేస్తావు!
ఇతరుల సమయం,
ఏమాత్రం హరించవు!
4.ఆచ్చుయంత్రం ఆవిష్కర్త!
నేటి పుస్తకాల రూపకర్త!
జాన్ గూటెన్ బర్గ్
ఆవిష్కరణ!
మానవజాతికి శాశ్వత,
బహూకరణ!
ఆయనకు శతాధికవందన,
సమర్పణ!
5.పుస్తకాలున్న ఇల్లే,
ఆనందాల హరివిల్లు!
పుస్తకం నిజవారసత్వం!
తరతరాలకు తరగని,
మహా సత్వం!
ఈ సత్యం గ్రహిద్దాం,
ఆచరించి చూపిద్దాం!
_________
ప్రపంచాన్ని తెలియాలి!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి