అభివృద్ధి పనులకు శంకుస్థాపన
 కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో 'మన ఊరు మన బడి' కార్యక్రమం కింద మంజూరైన  రూ.4,26,339 అభివృద్ధి పనులకు కాల్వశ్రీరాంపూర్ ఎంపీపీ నూనేటి సంపత్ కుమార్ యాదవ్, జెడ్పిటిసి వంగల తిరుపతి రెడ్డి, గ్రామ సర్పంచ్ ఆడెపు శ్రీదేవి గురువారం కొబ్బరి కాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. పాఠశాలలో తాగునీరు, విద్యుత్ సరఫరా, మేజర్, మైనర్ మరమ్మత్తుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఎంపీపీ, జడ్పిటిసి సంపత్ కుమార్ యాదవ్, తిరుపతి రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ అన్ని హంగులతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి ఉచిత నాణ్యమైన విద్యను పొందాలని వారు సూచించారు. అనంతరం పాఠశాలకు 100 మీటర్ల సీసీ రోడ్డు, వంటగది మంజూరు చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ప్రజాప్రతినిధులకు వినతి పత్రం అందజేశారు. దీనికి స్పందించిన ఎంపీపీ, జడ్పిటిసి, గ్రామ సర్పంచ్ అతి త్వరలోనే వంటగది, వంద మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. 
       ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉప సర్పంచ్ కరుణాకర్ రావు, ఎంపీటీసీ మాదాసి సువర్ణ రామచంద్రo, నాయకులు ఆడెపు రాజు, జూకంటి అనిల్, దంతనపల్లి రాజేందర్, గ్రామ కార్యదర్శి సతీష్, సిబ్బంది గట్టయ్య, రాజబాబు, తూండ్ల అరుణ, అనుముల రమేష్, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థినీ, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.కామెంట్‌లు