చదువు-వెలుగు , ముందస్తు ఉగాది వేడుకలు; జి.ప.ఉ.పాఠశాల.నీర్మాలమం:: దేవరుప్పుల.జి:: జనగామ.
  మా పాఠశాలలో శుక్రవారం జరిగిన  చదువు-వెలుగు ,  ముందస్తు ఉగాది   వేడుకలు.ఈ సందర్భంగా జరిగిన"బాలకవి సమ్మేళనం"లో అలరించిన చిన్నారులు.ఈ వేడుకల్లో ఈ విద్యాసంవత్సరం లో ఆరునెలల పాటుగా నిర్వహించిన "విజేత"పోటీలో గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడంతో పాటు,శ్రద్ధ-కృషి,కథా రచన,చదువు_వెలుగు,భాషా క్రీడలు,అతి తక్కువ సమయంలో ఉత్తమ మార్పు వంటి వివిధ అంశాల్లో విజేతలుగా నిలిచిన వారికి పెద్ద బాలశిక్ష తో పాటు,కథల పుస్తకాలను బహుమతులుగా అందజేయడం జరిగింది.
ఈ ఉత్సవాలలో ఉత్తమ కవి పుత్రుడు, స్వయంగా కవి వర్యులయిన మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగరాజు శ్రీనివాసరావు గారిని సత్కరించడం జరిగింది.
      

కామెంట్‌లు