లింగమయ్యా! (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
కొండపై ఉండేటి ఓ లింగమయ్యా 
శతకోటి పబ్బతులు " 
శతకోటి దండాలు "
!!కొండపై!!

త్రిశూల ధారివీ ఓలింగమయ్యా
త్రినేత్ర ధారివీ "
ఎద్దునెక్కీ నీవు "
లోకాలు దిరుగుతావు "
పాములన్నీ నీకు "
సొమ్ములైనాయి "
!!కొండపై!!

ఏనుగుతోలూ నీకు ఓ లింగమయ్యా
అంగవస్త్రమయ్యింది "
కాష్టంల బూడిద "
నీ ఒంటికే పూసినవు "
మనిషి పుర్రెతొ నీవు "
బిచ్చమెత్తుతావు "
!!కొండపై!!

నీవు బిచ్చమడిగేది ఓ లింగమయ్యా
మా భక్తి కాదా "
బదులు ఇచ్చేది "
మాకు నీ ముక్తి కాదా "
జగతికే నీవు "
శుభములిచ్చే వాడివి "
!!కొండపై!!


కామెంట్‌లు