అసలు నిజం! అచ్యుతుని రాజ్యశ్రీ

 "ఏంటిరాణీ! బడికి ఆలస్యంగా వచ్చావు? టెన్త్ క్లాస్ స్పెషల్ క్లాస్ ఎగ్గొట్టి ఫస్ట్ పీరియడ్ ఆలస్యంగా వస్తావా? హెచ్. ఎం.దగ్గరకు వెళ్ళు."క్లాస్ టీచర్ హుంకరింపుతో నిస్సహాయంగా చూసింది రాణి."సారీ మేడం! మా అమ్మ కి బాగా జ్వరం.వంట చేసి అమ్మకిపెట్టి మందులిచ్చి వచ్చేటప్పటికి ఆలస్యం ఐంది. క్లాస్ స్లిప్ టెస్ట్ రాసివెళ్దామని వచ్చాను.పక్క ఆంటీకి అప్పజెప్పివచ్చాను." కళ్ళవెంబడి బొటబొటనీరు కారుతోంటే వెక్కుతూ అంది రాణి."నిన్న సాయంత్రం మీఅమ్మను నిన్ను మార్కెట్ లో చూశాను.అప్పుడు బానే ఉందిగా?" కసిగా అరిచింది టీచర్. "మేడం! ఇవ్వాళ మా అమ్మ పోయిన రోజు. క్రితం ఏడాది సరిగ్గా  నాన్న గుండెపోటుతో  పోవటంతో అమ్మ దిగాలుపడింది.నామీదే ఆశలు పెట్టుకుంది టీచర్!" ఐనా వినిపించుకోలేదు ఆమె." హెచ్. ఎం.దగ్గరకు ఫో"కసిరింది."ఏమ్మారాణీ! ఎందుకు అంత ఖంగారు దిగాలుగా ఉన్నావు?"  "సారీ మేడం! నేను ఆలస్యం గా వచ్చానని  మాక్లాస్ టీచర్ మీదగ్గరకు పంపారు. " "ఎందుకు లేటుగా వచ్చావు?" ఆమె కంఠంలోని ప్రేమ ఆప్యాయతకు ఘొల్లుమంది రాణి."మేడం!నాన్న ని తల్చుకుంటూ అమ్మ రాత్రి అంతా ఏడుస్తూనే ఉంది. " "ఏడ్వకు తల్లీ! నీవు బాగా చదివి వృద్ధిలోకి వస్తావు.నో ప్రాబ్లం!క్లాస్ కి వెళ్ళు.""మేడం! స్లిప్ టెస్ట్ రాసి ఇంటికి వెళ్తాను."ఓ.కే"
హెచ్. ఎం.కి తన బాల్యం గుర్తుకొచ్చింది. తండ్రి మొహం తెలీని తనని ఎస్.జి.బి.టి.చేసిన తల్లి  అష్టకష్టాలు పడి పెంచింది. తనీ స్థితికి రావటంకి కారణం అమ్మ! నేటి పిల్లలు చాలా సున్నిత హృదయులు.చదువువత్తిడితో విసిగి వేసారుతున్న వారికి ఇంటిబైట ప్రశాంతత ఆప్యాయత  కొరవడుతున్నాయి.బడిలో టీచర్ల ఆప్యాయత  సానుభూతి ముఖ్యం.
ఆమర్నాడు కూడా రాణి దాదాపు పీరియడ్ ఐపోతుండగా రావటంతో టీచర్ అగ్గిమీద గుగ్గిలంలాగా మండిపడింది. టపటపా జడివానలా తిట్టి "గెటౌట్!గోటూ హెచ్. ఎం"అని రంకెలేసింది."మేడం!" తనని పిలుస్తున్న రాణి వైపు ప్రశ్నార్థకంగా చూసింది. "మేడం!నేను బడికి వస్తుంటే దారిలో స్కూటర్ తోపుడికి కింద పడిన తాత గారిని  ఆస్పత్రిలో  చేర్పించి వచ్చాను.అందుకే లేట్ ఐంది  మేడం!" హెచ్. ఎం.ఆమె భుజం తడుతూ "వెరీగుడ్!ఎంత మంచి పని చేశావు తల్లీ!ఆయన ఇంటికి ఫోన్ చేసి రాకపోయావా?" "మేడం!మన బడి టర్నింగులోనే తెలిసిన ఆస్పత్రి. మాఅమ్మ ఆ అంకుల్ దగ్గరకే వెళ్తుంది. ఆతాతగారి సెల్ తీసుకుని చేస్తామని డాక్టర్ అంకుల్  చెప్పారు. "రాణి చెప్తుండగా క్లాస్ టీచర్ పరుగున ఏడుస్తూ వచ్చింది. "మేడం! మానాన్నకి యాక్సిడెంట్  ఐందిట! ఎవరో అమ్మాయి చేర్పించిందిట.నాన్నను చూసి
 వస్తాను మేడం!ఎవరో ఆపుణ్యాత్మురాలు! ఆపాప చూడకపోయిఉంటే!మానాన్న.." అంటూ ఏడుస్తున్న టీచర్ని ఆటోలో పంపించి "రాణీ!యూ ఆర్ గ్రేట్ " అంటూహెచ్.ఎం.రాణీ భుజంపై ఆప్యాయంగా నిమురుతూ ఉండిపోయింది 🌹
కామెంట్‌లు