కవి " కావ్యసుధ'' ను సన్మానిస్తున్న మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహా రెడ్డి

  విశ్వభారతి మాక్స్ సొసైటీ సౌజన్యముతో, తెలుగు భాష చైతన్య సమితి, తెలుగు కూటమి, శ్రీ త్యాగరాజ గాన సభ, తెలంగాణ రచయితల సంఘం, లక్ష్య సాధన పౌండేషన్, మహిళా భారతి , గోల్కొండ సాహితీ సమితి, పాలడుగు నాగయ్య కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 30 తేదీ గురువారం  శ్రీ శుభకృత్ సంవత్సర ఉగాది సందర్భంగా "రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం"  శ్రీ త్యాగరాజ గానసభ చిక్కడపల్లి, హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. రెండువందల మంది కవులు, కవయిత్రులు, పండితులు పాల్గొన్నారు.
  
          మేడ్చల్,  మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్. ఏనుగు నరసింహా రెడ్డి గారిచే ప్రముఖ కవి, వ్యాసకర్త, రచయిత, సీనియర్ జర్నలిస్ట్
శ్రీ కావ్యసుధ , "రాష్ట్ర స్థాయి కవిసమ్మేళనం" లో సన్మానం పొందుతున్న చిత్రంలో... తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ నాళేశ్వరం శంకరం ప్రభృతులు ఉన్నారు.
కామెంట్‌లు