రేడియో;-మంజీత కుమార్--బెంగళూరు
ఒంటరిగా ఉన్నప్పుడు జతగా
ప్రయాణాల్లో తోడుగా
పాటల సాగరంలో ఓలలాడించే నేస్తం

అమ్మకు భక్తి పాటలతో రోజు ఆరంభం
నాన్నకు వార్తలతో ఇంటికే ప్రపంచం

తాతయ్యకు పాడి పంటల కార్యక్రమం
నాయన్నమ్మకు వయోవృద్దుల విశేషాలు

నిరుద్యోగుల కోసం ఉద్యోగ అవకాశాలు
డాక్టర్లు, నిపుణుల ఇంటర్వ్యూలు

వీనులవిందైన సంగీత కచేరీలు
సందేశాత్మక నాటకాలు, కథలు

యువత మదిని తట్టే యువవాణి
హుషారెక్కించే సినీ పాటలబాణి

రేడియో ఒక మంచి వ్యాపకం
మనసులతో పెనవేసుకుపోయిన బంధం

టీవీ, ఇంటర్నెట్ వచ్చినా తరగని అభిమానం
ఎఫ్. ఎం. రేడియోలతో కొత్త ప్రభంజనం
రేడియో ఎప్పటికి మనందరి ప్రాణం

ప్రతి ఒక్కరిని అలరించే సాధనం
వీనుల విందు చేసే మనోల్లాసంకామెంట్‌లు