ఎదురు చూస్తూనే ఉందాం ..!!---సుధాకర్ రెడ్డి.కె
కొత్త పార్టీలు
పెట్టగలం..!

రంగు రంగుల
కండువాలకు
అర్ధాలు జోడించి
సృష్టించగలం!

కొత్త సీసాలో
పాత సారాయి
నింపగలం...!

కొత్త పద్ధతులతో
ప్రజానీకాన్ని
మభ్యపెట్టి
పాత సింహాసనం పై
కొత్తగా కూర్చోగలం!

అభివృద్దా...?
అదేంటి కొత్త పధం లా-
ఉందే...!

మా పూర్వపు
నేతలకు తెలియనిది
మేము ఎలా పాటించగలం!

మాకు వారసత్వం గా
వచ్చింది ఒక్కటే,
రైతన్నల నడ్డివిరగదీయడం
భూకబ్జాలు చేయడం
ఇవ్వన్నీ కూడా
కొత్త పద్దతులలోనే
చేస్తాం...!

అన్యాయానికి
ఆరాచకానికి
బ్రాండ్ అంబాస్డర్స్
మేమె...
మమ్మల్ని ఎన్నుకున్న
కర్మ మీదే....!

మారదులోకం
మారదు మానవ జీవితం!

"దగా పడిన తమ్ముల్లారా 
ఏడవకండేడేవకండి
జగన్నదరథ చక్రాలోస్తున్నాయ్..."

ఎప్పుడో....మరి
వేచి చూద్దాం
ఓటు మాత్రం వేస్తూనే ఉందాం.!!

                     ***

కామెంట్‌లు