మహాకవి శ్రీశ్రీకి జోహార్లు;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
శ్రీశ్రీలాగా కవిత్వం
వ్రాయాలనియున్నది
కలాన్ని కత్తిలాగా
కదిలించాలనియున్నది

విప్లవ సాహిత్యం
విరచించాలనియున్నది
విలపించే పేదలను
వికసింపజేయాలనియున్నది

ఛందస్సు సంకెళ్ళను
తెంచాలనియున్నది
బానిస సంకెళ్ళను
తుంచాలనియున్నది

కర్షకులను
కాపాడాలనియున్నది
కార్మికులను
కలిపి విజయంసాధించాలనియున్నది

శ్రీశ్రీ మహాకవిని
స్మరించాలనియున్నది
చెయ్యెత్తి జైకొట్టి
కీర్తించాలనియున్నది


కామెంట్‌లు