దురాశ! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆఊరి లో శివ చిన్నా చితకా పనులు చేస్తూ  తన పెంపుడు కొడుకు రాజు తో ఉంటున్నాడు.శివా కిపెళ్లికాలేదు.అనాధబాలుడైన రాజు ని తన చేతికింద ఉంచుకుని  వాడికి తిండిపెట్టేవాడు.పదేళ్ల రాజు చాకులాంటి చురుకైన కుర్రాడు. హాయిగా పిల్లనగ్రోవి వాయించేవాడు.వాడి పాటకి జనం మెచ్చి కనీసం రెండు రూపాయలన్నా వాడి చేతిలో పెట్టేవారు.పాపం  ఆడబ్బుని శివా గుంజుకుని వాడికో పండో మిఠాయి కొనిఇచ్చేవాడు.ఒక రోజు  రాజు ఫ్లూట్ వాదనకి మురిసిపోతూ ఓ అరవైఏళ్లు పైబడిన వ్యక్తి గుడిసె లోపలికి వచ్చాడు. పొయ్యి మీద అన్నంకుతకుతకి తగినట్లే వాయిస్తూన్న రాజు ని చూసి ముచ్చట పడి వాడిచేతిలో ఓవెండి నాణెం పెట్టాడు. అది చూసి న శివా లో దురాశ మొదలు ఐంది. రాజు చేతిలోని నాణాన్ని లాక్కుని "ఏమయ్యోయ్!ఓముసలాయనా!నాబాకీ చెల్లించి మరీకదులు అని దబాయించాడు. ఆవృద్ధుడు ఆశ్చర్యం గాచూస్తుంటే శివా అన్నాడు "నాకొడుకు పాట వెల కనీసం  పది వెండి నాణాలు. ఒక్కటే నాణెం చేతిలో పెడతావా?మిగతా తొమ్మిది నాణాలు బైట కి తీయి." నాదగ్గర ఇది ఒక్కటే ఉంది  అనిఆపెద్దమనిషి అన్నాడు. "ఆహా!నీమెళ్లో బంగారు గొలుసు ఇవ్వు "దాదాగిరి ప్రదర్శించాడు."నేను ఒంటరిగా తిరుగుతూ ఉంటాను.గొప్ప కోసం గిల్ట్ ది వేసుకుంటాను. నాతో రా!బంగారు మొహిరీలు ఇప్పిస్తాను".అంతే శివా లో ఆశపెరిగిపోయింది."ఈముసలాడు వెర్రి బాగులవాడిలా ఉన్నాడు."అనుకుంటూ  అతని వెంట నడవసాగాడు.ఆఇద్దరూ ఓభవంతి ముందు ఆగారు.అక్కడున్న కాపలావాడు పెద్దాయనకు వంగివంగి దండాలు పెట్టడం శివా కి విచిత్రంగా అనిపించింది. "అరే!ఈశివాని బంధించండి.ఓపిల్లాడి కష్టార్జితంని వీడు మెక్కుతూ  రాత్రి పూట తాగితందనాలు ఆడటం రెండు రోజులుగా నేను చూశాను. ఆపిల్లాడు రాజు ని  తీసుకుని రండి "అని తన ఇద్దరు సేవకులకు పురమాయించాడు.ఆఊరి జమీందారు ఇలా మారువేషంలో తిరుగుతూ అందరినీ గమనించుతాడు అన్న విషయం తెలుసు కున్నశివా పైప్రాణాలు పైనే పోయాయి. వాడిని తన తోటపనిలో పెట్టి  రాజుని బడిలో చేర్చిన జమీందారుకి కన్నీటితో  పాదాభివందనాలు చేశాడు రాజు. వాడి కి చదువు తోపాటు సంగీతం లో కూడా శిక్షణ ఇప్పించసాగాడు.శివా దురాశ తో రాజు జీవితం బాగుపడింది కదూ?🌷
కామెంట్‌లు