వేప పూల లేత దనం
మామిడి కాయలు వగరు దనం
చింత పులుసు పులకించె పుల్ల దనం
నోరూరించే బెల్లం తీపి దనం
ఉప్పు, కారం, తీపి, చేదు,వగరుల
షడ్రుచుల వలే కష్ట, సుఖాలతో సాగుతున్న ఈ జీవితంలో ఆనందాన్ని నింపేదే ఈ ఉగాది
కళకళలాడే ఇంటి గుమ్మలకు పచ్చని మామిడి తోరనాలే అందం
తేట తెలుగు తియ్యదనం
తెలుగింటి ఆడపడుచుల నవ్వుల వనం ఇవన్నీ కలిస్తేనే మన ఉగాది పచ్చడి కమ్మదనం
కవిత ;-బి. రేవతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి