మరుగున పడిన మహనీయులు! సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 భారతీయ ఫోటోగ్రాఫర్ లాలా దీనదయాళ్ ని గూర్చి దాదాపు  ఎవరికీ తెలీదు.19వశతాబ్దపు తొలి రోజుల్లో హైదరాబాద్ నిజాం ఆస్థాన ఫోటోగ్రాఫర్ గా వారి పెళ్లిళ్ళు దర్బార్ పులివేట మిలటరీ పెరేడ్ ఆనాటి హైదరాబాద్ వీధులు అన్నీ తన కెమెరాలో బంధించాడు.ఇండోర్ లో పి.డబ్లు .డి.ఇంజనీర్ గా పనిచేసిన ఆయన ఢిల్లీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాజవంశీయుల ఆహ్వానం అందుకున్నాడు. ఆరవ నిజాం ప్రపంచంలోనే  అత్యంత ధనవంతుడు.ఈయన ఫోటోగ్రఫీ కి ముగ్ధుడై ముసావీర్జంగ్ అనే బిరుదుని ప్రదానం చేశాడు. ఆయన మరణంతో దరిద్రంలో మునిగిన ఆతనివారసులు50వేల గ్లాస్ నెగెటివ్స్ ని కారుచౌకగా అమ్మేశారు.1977లోదీనదయాళ్ ఫోటో ఎక్జిబిషన్ ని లండన్ లో నిర్వహించారు. దాన్ని చూసిన  అమెరికన్ రచయిత 1980లోఅప్పట్లో సికింద్రాబాద్ లో ఉన్న ఆయన మనవడుఅమీచంద్ దగ్గర 1500ఫోటోలనుకొన్నాడు.నెగిటివ్స్ కూడా విదేశీయులు కొన్నారు.మనదేశం  ముఖ్యంగా హైదరాబాద్  అమూల్య సంపదను పోగొట్టుకుంది.
పాత్రికేయుడు కందుకూరి ఈశ్వర్ దత్ అసలు సిసలు తెలుగువాడు.రాజమండ్రిలో పుట్టిపెరిగిన ఈయన ఆంగ్లభాషలో మేటి! పట్టాభి సీతారామయ్య గారి ఆంగ్లవారపత్రిక జన్మభూమిలో అరంగేట్రం! ప్రకాశం పంతులు గారి స్వరాజ్య ఆంగ్ల దినపత్రికలో  సబ్ఎడిటర్ గా ఆపై దిహిందూలోచేరి తొలిసారి  ఆంధ్రదేశపు వార్తలు  ప్రచురించారు. ఇది కొత్త మలుపు  ఓకుదుపు కూడా! జాతీయ స్థాయిలో ప్రముఖ ఎడిటర్ చిర్రావూరి చింతామణి తోవిభేదాలు రావటం తో రిజైన్ చేసి దేవదాసు గాంధీ హిందుస్తాన్ టైమ్స్ లో చేరారు. దిస్ట్రీట్ ఆఫ్ ఇంక్ అని ఆత్మ కథ రాశారు.10 జూన్1968లో మరణించిన ఈయన మనకుతెలీదు.ఇదే తెలుగువారి గొప్పతనం! పత్రికారచన కి ఇంగితజ్ఞానం ఆకళింపు  రచనాశక్తి ఆత్మాభిమానం ఉండాలి అని తన జీవితంలో నిరూపించారు. 
భయంకరమైన కుష్టువ్యాధిపై పరిశోధనలు చేసి దాన్ని నివారించవచ్చు అని నిరూపించారు డాక్టర్ భావ్ దాజీ!అలా రోగం నయమవటం చూసి అసూయతో తోటివైద్యులు కిరాయి గూండాలతో ఈయనను కొట్టించి చంపే ప్రయత్నం చేశారు అంటే నమ్మం!ఇది1867లో జరిగిన సంఘటన!కిడ్నీ రోగులనించి  ఉచితంగా సేవాభావంతో ఒక పెట్టెనిండా భద్రపరచి ఆరోజుల్లో అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు డాక్టర్ భావ్ దాజీ! ఛారిటబుల్ డిస్పెన్సరీ నెలకొల్పి కాటరాక్ట్ ఆపరేషన్ చేసిన ఘనుడు! విదేశీయుల ప్రశంసలు పొందిన ఆమహనీయుడు ఆనాటి కుళ్ళు కుతంత్రాల మధ్య మరుగున పడ్డాడు. ఇలాంటి వారి జీవితచరిత్రలు పాఠాలుగా మోరల్ సైన్స్ లో ఉంటే పిల్లలకి తెలుస్తుంది. 🌷
కామెంట్‌లు