-మానవ నైజం - ద్విముఖ వైఖరి ;-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
 ఇచ్చిన దానితో సంతృప్తిలేని మానవ నైజం 
అందనివాటికోసం అర్రులు చాస్తోంది 
స్వచ్ఛమైన సంప్రదాయం సంస్కృతి వదిలేసి 
విదేశీ వికృతపోకడలు పోతోంది 
సత్యం ధర్మం కారుణ్యభావాలు మరచి 
సమాజంలో అదుపులేనంత ఆస్తులు కూడబెట్టేసీ 
సామాన్యపౌరుల పొట్టగొట్టే నైజం చూపుతోంది
పంచభూతాల ప్రకృతిని పంజరంలో బంధించి 
దోపిడీ చేస్తున్న మానవదురాశ 
నదులు,కొండలు అదృశ్యం చేసే బుద్ధితో 
కొన్ని తరాలకి కూడబెట్టేనైజంతో ఉంది 
చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనేది ఈ కలియుగధర్మం 
మరిచిపోకండి ఇక్కడ చేసినదానికి ఇక్కడే ఫలితం ఉంటుంది. 
అనుభవించక తప్పదు. 
రక్త సంబంధం కూడ లెక్కచేయని స్వార్థం 
వాడుకొని వదిలేసే తత్వంగానే 
కొన్ని వేదనాభరిత అశ్రువులశాపాలు 
ఈ నాటి మానవనైజాన్ని తప్పకుండ వెంటాడుతాయి!!

కామెంట్‌లు