శత్రుఘ్నుడు.పురాణ బేతాళ కథ..; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు శత్రుఘ్నుడు గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు. 'బేతాళాశత్రుఘ్నుడు రామాయణంలో దశరథుని కుమారుడు, శ్రీరాముని తమ్ముడు. ఈయన తల్లి సుమిత్ర. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కవల పిల్లలు. రామాయణం ప్రకారం రాముడు విష్ణువు ఏడవ అవతారం అయితే లక్ష్మణుడు ఆదిశేషుడి అంశ. భరతుడు సుదర్శన చక్రం అంశ కాగా శత్రుఘ్నుడు శంఖం అంశ.
శ్రీరాముడు శివధనుర్భంగంచేసినతరువాత, జనకమహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తె అయిన శ్రుతకీర్తిని శత్రుఘ్నునితో వివాహం జరిపిస్తారు.
జననంసవరించు
శత్రుఘ్నుడు దశరథ మహారాజుకు, ఆయన ముగ్గురు పట్టపురాణులలో రెండవది, కాశీ రాకుమారి అయిన సుమిత్రకు జన్మించిన వాడు. సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కవల పిల్లలుగా కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు జన్మిస్తారు.
రాముడు అరణ్యవాసం చేస్తున్నపుడు కైకేయి మనసు విరిచి రాముడు అడవులపాలు కావడానికి కారణమైన మంథరను శతృఘ్నుడు చంపబోగా రాముడు ఇలాంటి కార్యాలను హర్షించడని భరతుడు అతడిని వారిస్తాడు.
భరతుడు వెళ్ళి రాముడిని తిరిగి రాజ్యానికి రమ్మని ఆహ్వానిస్తాడు కానీ రాముడు అందుకు అంగీకరించడు. చివరికి రాముడు పాదుకలను తనతో తీసుకుని వచ్చి రాజ్యభారాన్ని వహిస్తుంటాడు భరతుడు. పేరుకు భరతుడు రాజ్యభారం వహిస్తున్నా అందులో శత్రుఘ్నుని పాత్ర చాలా ముఖ్యమైనది. రాచకార్య నిర్వహణలో భరతుడికి సాయంగా ఉండేవాడు. అలాగే రాముడు, లక్ష్మణుడు, భరతుడు అయోధ్యలో లేనప్పుడు ముగ్గురు రాణులకీ శత్రుఘ్నుడే అండగా ఉండేవాడు.
రాముడి అవతార పరిసమాప్తి కాగానే ఆయన సరయు నదిలో ప్రవేశించి విష్ణువుగా వైకుంఠాన్ని చేరుకుంటాడు. రామునితో పాటు అతని తమ్ములైన లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా ప్రాణత్యాగం చేసేస్తార 'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.


కామెంట్‌లు