మా ఊళ్ళేనా సిన్నప్పుడుఒగాది పండుగు దినం యెట్లుండెనంటే....ఎగిలి వరంగనే లేసుడు ,దొడ్డి కాడికి వోయితట్టల పెండేసు కచ్చుడు,కట్ట పుల్లలతోనిపొయి అంటు వెట్టుడు,పొయి మీద నీళ్ళ కుండవెట్టి కాగ వెట్టుకునుడు ,నీళ్ళు కాగేటాల్లకుదవ్వ దవ్వ ఇల్లాకిలిఊడ్సుడు,ఆకిట్ల అలుకు జల్లుడు,ఇల్లు అలుకుడు,జాజు తోనిదేవుని అర్రను అలికికడుపలు కడిగి పచ్చ ముగ్గు, ఆకిట్ల తెల్ల ముగ్గేసుడు,నీళ్ళు కాగినంకఉడుకుడు నీళ్ళ తొనితానం జేసుడు,కొత్త అంగి, లాగు ఏసుకునుడు,దారానికి కుడుక కట్టికుడుకల బెల్లం పెట్టిమెడల ఏసుకునుడు,దాన్ని కొంచెం కొంచెంకొరుక్క తినుడు,ఇగమా అవ్వపొద్దుగాలనే ఓ తవ్వెడుకొత్త సెనిగె పప్పునునాన వోసేదిపప్పు బగ్గ నానినంకరోట్లె వోసి సిన్న రోకటి తోని మెత్తగ దంచేది.నడిమిట్ల కొంచెం కొత్త బెల్లం గుడ ఏసేది. ఇంక సోంపు గుడ ఏసి, కలిపి ముద్ద జేసి ఒక సిన్న బగొండ్ల ఎత్తేది.అటెన్కపొయి మీద పెనం పెట్టిపెనం కాగినంక పెనెం మీదకొంచెం నెయ్యి వోసికొత్త గోదుమ పిండి తోనిసిన్న రొట్టెలు జేసిదాంట్ల కొంచెం కొంచెంసెనిగె పప్పు ముద్దను పెట్టిమడత పెట్టి బూరెను సేసిపెనం మీద ఏసిసరాతం తోని అటూ, ఇటూ మర్రేసి కాలినంక తీసి తాంబోలంల ఏసేది. అన్ని అయేదాక పానం ఆగక పోయేది.రెండు మూడు బూరెలు కాంగనే 'ఒకటియ్యవా 'అని మా అవ్వనుఅడుక్కొని తినేటోన్ని.బూరెలన్ని సేసుడుఅయినంక మా నాన,మా అవ్వ ,నేను కలిసిబూరెలు తినేటోల్లం.మా అవ్వకొన్ని నేతి బూరెలనుసిన్న గిన్నెల కొంటవోయిసుట్టు పక్కలోల్లకుఇచ్చచ్చేది.కొత్త గోదుమలు,కొత్త సెనిగె పప్పు,కొత్త బెల్లం,కొత్త చింతపండు,కొత్తబియ్యంకొత్త కుండల నీళ్ళుఅబ్బ... ఆ రుసే రుసి.మాపటి జాములకుఅన్మాండ్ల గుడి కాడికిఅందరం పోయేటోల్లం.ఎములాడ సాంబయ్యకొత్త పంచాంగం సెప్పేటోడుఆ యాడాదిలఆనలు బగ్గ పడుతయా?పంటలు మంచిగ పండుతయా?లాబమెంతుంటది?అని అడిగితే సెప్పేటోడు.గంతే కాదుల్లా!లగ్గాలు పెట్టుకునుడో,ఇండ్లు కట్టుకునుడో,ఇంట్ల ఏదన్నామంచి పనులు సేసుటానికోగిట్ల ఏది సేయాలన్నాసాంబయ్య తోని మూర్తాలుపెట్టుకునేటోల్లం.ఇగగిప్పుడు సేసుకుంటున్న వొగాది పచ్చడిమొదట్ల లేనే లేదుల్లా!నడిమిట్ల అచ్చిందే.ఔ మల్ల!
ఔ మల్ల!;-- బాలవర్ధి రాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి