చదువు (బాలగేయం);-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
చదువోయి నీవు 
చదువోయి చదువుకుని 
చక్కగా మనవోయి !!చ!!

చదువంటి భాషలా
చదువంటే గణితమా
చదువంటే విజ్ఞాన శాస్త్రమా
చదువంటె సాంఘిక శాస్త్రమా
అన్ని విషయాలా మేళవింపోయీ 
అన్ని విషయాలా ఆకళింపోయీ !!చ!!

చదువంటె నీతి చదువంటె నియమం 
చదువంటె ప్రేమానురాగాలు
చదువంటె ధైర్యం చదువంటె స్థైర్యం
చదువంటె పరమత సహనమ్మూ 
చదువంటె మానవత పరిమళమ్మోయీ
!!చ!! 

చదువుంటె డాక్టరూ చదువుంటె మాష్టరూ
చదువుంటె పోలీసు ఉద్యోగి
చదువుంటె జిల్లా కలెక్టరే కావచ్చు
చదువుకోనాయనా చదువుకో తండ్రీ !!చ!!

నీవు చదివిన చదువు వ్యర్థమూ కాదురా
నీకెగాక పరుల కుపయోగ పడునురా
నీవు చదివిన చదువు విశ్వమానవ వెలుగు
నీవు చదివిన చదువు విశ్వజీవన హితవు !!చ!!


కామెంట్‌లు