అష్టాంగ నియమాలు (వ్యాసం);-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
 లక్ష్య సాధకుడు, మహనీయుడైన పతంజలి మహర్షి గారు 950 యోగ సూత్రాలను మనకందించారు. వాటిలోనివే అష్టాంగ నియమాలు.
1). యమము.......... అహింస, బ్రహ్మచర్యం, పాప రహితం, పరుల వస్తువుల ఆశించకుండుట,ఈ ఐదింటిని కలిపి" యమము"అని  పిలుస్తారు. ఈ ఐదింటిని మనిషి ఆకలింపు చేసుకుని, తన జీవన సామ్రాజ్యాన్ని స్థిరం చేసుకోవాలి.
        బ్రహ్మచర్యం, దయ, క్షమ , ధ్యానం, సత్యం, పాప రహిత స్థితి, అహింస, అస్తేయం, మాధుర్యం, దమము ఇవి యమమని మరొక యోగశాస్త్ర గ్రంథం తెలిపినది.
2). నియమము.......... శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయ ము, ఈశ్వరప్రణిధానము, నియమములు అని వేదాంత సారం తెలుపుతుంది. తపం, సంతోషం, అస్తిత్వం, దానం, దేవతాపూజ, సిద్ధాంతం, శ్రవణం, మనోనిగ్రహం జపం, అగ్నికర్మ(హోమము) ఇవి నియమములని తంత్ర సారం చెబుతుంది.
3). ఆసనం........ ఆసనం అంటే ఇప్పుడు భౌతికమైన హలాసనం, గరుడాసనం, శీర్షాసనం వంటి వాటిని అనేక యోగాసనాలుగా పాశ్చాత్యులు పొరబడ్డారు. నిజానికి ఈ ఆసనాలన్నీ యమ, నియమ,స్థాయిలోనే సాధకుని చే  సాధన చేయిస్తారు. నిజానికి పతంజలి మహర్షి  చెప్పిన ఆసనం అంటే మనసును ఆత్మతో సంధానం చేసి ఇ స్థిరంగా ఉండటం. దీనిని స్థిర సుఖాసనం అన్నారు. ఆసనం అష్టాంగ యోగ మూడవ అంగం. అయిదు విధములైన కర చరణ స్థానములను నిర్దేశించేది. పద్మాసనం స్వస్తి సౌఖ్యం ప్రదం. వజ్రాసనం తదావీరాససమితి కమలాసన పంచకం (భాగవతం 3-28-11)
4). ప్రాణాయామం......... శరీర స్పందనలు అన్నింటిని క్రమబద్ధీకరించడమే ప్రాణాయామం. దీని వలన శరీర దోషాలు, ధారణ వలన సంసర్గత(సాంగత్య) దోషాలు ధ్యానము వలన శనీశ్వర గుణాలు తొలుగుతాయి. ప్రణవం(ఓంకారం) తో ముమ్మారు ప్రాణాయామం పూరక కుంభక రేచకాలతో చేయాలి.
5). ప్రత్యాహారం......... ఇంద్రియ జనితములైన బాహ్య ప్రపంచం శబ్దములు లు దృశ్యములను నుండి దృష్టిని గ్రహించి అంతరంగం పై చింతించుట ప్రత్యాహారం అంటారు .
6) ధారణ......... ధారణ అంటే బ్రహ్మమును హృదయ పద్మంలో ధరించుట. ఇది మనోస్థితి. ధ్యానం బ్రహ్మ ఆత్మల గురించిన చింత. ఇది ఇది సాధన (ప్రగతితో కూడిన గతి) గమ్యం సమాధి. అహం బ్రహ్మ తత్వం మన అనుభవంలోకి వచ్చే స్థితి.
7). ధ్యానం......... వస్తువు పైన ధ్యేయం, మనసును లగ్నం చేసి అన్య పదార్థములను గమనించక, నిశ్చలమైన మనసుతో ధ్యేయ వస్తువుపైన ఈశ్వరుని గురించిన చింతనలో ఉండుటయే ధ్యానం. సాధన పూర్వకంగా పొందిన ద్వైత రహిత స్థితి సమాధి(జీవుని ఈశ్వరుని వేరుగా భావించుట ద్వైతం). వానిని ఒకే వస్తువు గా అనుభవించుట అద్వైత స్థితి అదే సమాధిస్థితి.
8) సమాధి......... నిత్యం శుద్ధమైన బుద్ధి తో కూడి, సత్యమైన, ఆనందంతో కూడిన తురీయ(మెలుకువ, నిద్ర, స్వప్నం స్థితులకు అతీతమైన) స్థితిలో ఏకము. అక్షరము (శాశ్వతమైన) యై నేనున్నాను. (అహమస్మీ) అనే బ్రహ్మ భావనలో అహం బ్రహ్మాస్మి (నేనే బ్రహ్మను) అనే ఎరుక కలిగియుండు అవస్థయే సమాధి.
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.
,,

కామెంట్‌లు