వజ్రాయుధం. పురాణ బేతాళ కథ.;- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు, చెన్నై

విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు వజ్రాయుధం  గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు' అన్నాడు. బృహస్పతి తన రాచ సభలో చేసిన అవమానం వలన, బృహస్పతి ఇంద్రుడిని విడిచి వెళ్తాడు. దాని వల్ల త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుడు అనే బ్రాహ్మణోత్తముడిని వేడుకొని గురువుగా పొందుతాడు. రాక్షసులని సంహరిస్తాడు. రాక్షసులకు మేనమామ అయిన విశ్వరూపుడు రాక్షసుల మాట మేరపు హవిస్సులను రాక్షసులకు ఇస్తాడు. దానితో కోపించి తన వద్ద ఉన్న చంద్రహాసంతో విశ్వరూపుడి తలలు నరికి సంహరిస్తాడు. దానితో బ్రహ్మహత్యపాతకం ప్రాప్తిస్తుంది. తన కుమారుడి సంహారం జరిగిందని తెలిసిన త్వష్ట ప్రజాపతి యజ్ఞాన్ని చేసి ఇంద్రుడిని సంహారించేందుకు ఒక రాక్షసుడిని సృష్టిస్తాడు. ఆ రాక్షసుడు వృత్రాసురుడు. వృత్రాసురుడు సర్వలోకాలను సంహరిస్తూ అల్లకల్లోలం చేస్తుండగా, ఇంద్రుడికి , దిక్పాలురులకు తోచక మహా విష్ణువుని సంప్రదిస్తారు. మహావిష్ణువు తరుణోపాయంగా దధీచి మహర్షి వద్దకు వెళ్ళి ఆయన వెన్నుముక కోరి, విశ్వకర్మచే ఆ వెన్నుముకతో నూరు అంచులు కల వజ్రాయుధం చేయించి వృతాసురుడి సంహారం చెయ్యమని చెబుతాడు. ఆ విధంగా దధీచి మహర్షి వెన్నుముకతో చేయబడిందే వజ్రాయుధం 'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.

కామెంట్‌లు