సుస్వాగతమమ్మా!శుభకృత్!;-కాటేగారు పాండురంగ విఠల్
స్వాగతమమ్మా!శుభకృత్!సుస్వాగతం
నవ వసంతమా!శుభకృత్ సుస్వాగతం
గాన కోకిలమ్మా!స్వరకృత్!సుస్వాగతం
నవ్య పల్లవమా!సుఖకృత్!సుస్వాగతం

సృష్టి ఆరంభ సూచిక యుగాది పర్వం
రవి గమనారంభ వేడుక ఉగాది పర్వం
గ్రహ నక్షత్ర గతి నిర్దేశిక ఉగాది పర్వం
సౌరమానపు ప్రారంభిక ఉగాది పర్వం

కుసుమాకరం వసంత ఋతు ప్రాభవం
ప్రకృతి పచ్చదన కారణం నవ పల్లవం
పుష్ప సౌరభ సుగంధ భరిత వైభవం
వీరి తేనెలు జాలువారే మధు మాధవం

ప్రకృతిమాత ఒడి సుందరబృందావనం
మనోరంజకరం కమళాకార సుమవనం
శతవర్ణ సుశోభిత సౌందర్య పుష్పవనం
వజ్ర వైడూర్య సమాకృతి సరసిజ వనం

కవి కూజిత భావ సమన్విత కవనము
రసరమ్య సమ్మిళిత సుస్వర కావ్యము
ఆమని ఆలాపనయుక్త కవితా గానము
నవవత్సరం హృదయోల్లాస భరితము

స్వాగతమమ్మా!శుభకృత్!సుస్వాగతం
నవ వసంతమా!శుభకృత్ సుస్వాగతం
గాన కోకిలమ్మా!స్వరకృత్!సుస్వాగతం
నవ్య పల్లవమా!సుఖకృత్!సుస్వాగతం


కామెంట్‌లు