నక్క సలహా! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఓవృద్ధ రైతు  అలా పొరుగు నగరానికి బైలుదేరాడు.దారిలో ఓచిట్టడవి వచ్చింది.ఆహారం కోసం వెంపర్లాడుతూ ఒక మొసలికూడా  పొట్ట నిండామెక్కి ఆపై ఎండలో పచార్లు చేస్తూ ఓగుంటలో పడిపోయింది. దూరం గా ఇసుక తవ్వకాల కోసం ఆగిన లారీలున్నాయి. రైతు అలా నడుస్తూ  ఆనీటిమడుగు దగ్గర ఆగి తన అన్నంమూటనువిప్పి మంచి నీటికోసం ఆమడుగు దగ్గరకు వెళ్లాడు.నీరు తాగి వస్తుండగా గుంటలో ఉన్న మొసలి"ఓతాతా! నన్ను పైకి తీసి కాపాడవూ?" అని బ్రతిమాలసాగింది."అమ్మో!నిన్ను పైకి తీస్తేనన్ను చంపేస్తావు.మొసలి పట్టుకి ఏనుగుకూడా బలాదూర్ " అన్నాడు రైతు. "ఉహు!మీమనుషులే కృతఘ్నులు.చేసిన మేలు మర్చిపోతారు"అంది మొసలి.అటుగా వెళ్తున్న  ఒక ఎద్దు ఆమాటవిని ఇలా అంది"నిజం చెప్పావు మొసలీ! నేను పడుచుదనంలోఉండగా  ఇతని బండిలాగాను.పొలం దున్నేప్పుడు కర్రతో కొడితే సహించాను.అప్పుడు నాకు బాగా గడ్డి దాణాపెట్టేవాడు. కుడితి తాగించేవాడు. ముసలి దాన్ని అయ్యేటప్పటికి కసాయివాడికి అమ్మేయాలని చూశాడు.అందుకే పారిపోయాను."ఎద్దు తిడుతుంటే మొసలి బాగా ఆనందించింది. ఇంతలో  ఒక దూడ అటుగా వచ్చింది.
మొసలి తో అంది"అవును మనిషి మహాస్వార్ధ పరుడు.మాఅమ్మ పాలను కనీసం ఐదు నిముషాలు కూడా నన్ను కడుపునిండా తాగనీయకుండా బలవంతంగా పొదుగునించి ఈడ్చి కెళ్ళి గుంజకు కట్టేస్తాడు.ఆఖరి బొట్టు దాకా అమ్మ పాలు పిండుకునే మహాస్వార్ధం మనిషికి!"అనటంతో మొసలి కి ఇంకా సంతోషం వేసింది. ఇంతలో ఒక నక్క అటుగా వచ్చి మొసలి ని"ఏంటి సంగతి?"అని అడిగింది. "చూడు నక్కా! ఈమనిషి నన్ను గోతిలోంచి బైటికి తీయడుట!నేను అతనిని పట్టుకొని కరకర మింగుతానని భయపడుతున్నాడు.నదులు చెరువులు అన్నీ ప్లాస్టిక్ చెత్త చెదారాలతో రసాయనాలతో  కలుషితం చేస్తూ ప్రాణులకు హానిచేస్తున్నాడు.ఈరైతు నన్ను బైటికి తీయడుట! నీవన్నా నచ్చ జెప్పవూ?" నక్క మహా టక్కుటమారంది."నిజమే!మనిషి మహాస్వార్ధ పరుడు.చూడు రైతన్నా!మనం ఇద్దరం కల్సి ఈగొయ్యిని మట్టి చెత్త చెదారాలతో నింపేద్దాం. అప్పుడు మొసలి దాని పైకెక్కి నీటిలోకి జారుతుంది.దాని కోరిక  నీభయం తీరుతాయి."అని చెప్పి రైతు తో మట్టి ఇసుక గుంటలోకి పోయిస్తూ  పెద్ద బండరాళ్ళను దొర్లించింది.అంతే మొసలి కాస్త బాగా గాయపడి గగ్గోలు పెడుతూంటే నక్క  రైతు తో అంది"తాతా! నీదోవన నీవు పో!ఇక మొసలి చచ్చినా బైటికి రాలేదు"అని  తన తెలివితో రైతు తన ప్రాణాలను కాపాడింది🌹
కామెంట్‌లు